సీఏఏపై ఆందోళనగా ఉంది .. యూఎస్​ సెనేటర్ కార్డిన్ కామెంట్​

న్యూఢిల్లీ: సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)పై అమెరికా మళ్లీ కామెంట్ చేసింది. సీఏఏ అమలుతో ముస్లింలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని తాము ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ‘‘వివాదాస్పద సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ) అమలు కోసం ఇండియన్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడంపై నేను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాను. ముఖ్యంగా దీని ప్రభావం అక్కడి ముస్లింలపై ఎలా ఉంటుదనే దానిపై ఆందోళనగా ఉంది. అంతేకాకుండా పవిత్రమైన రంజాన్ మాసంలోనే సీఏఏ అమలుకు సంబంధించి భారత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం సమస్యను మరింత తీవ్రం చేసింది” అని అమెరికాసెనేటర్ బెన్ కార్డిన్ అన్నారు.