సొంత విమానంలో వెళ్తుండగా.. ఇద్దరు కూతుళ్లతో సహా నటుడు మృతి

అమెరికా నటుడు క్రిస్టియన్ ఆలివర్, అతని ఇద్దరు కుమార్తెలు తూర్పు కరేబియన్‌లోని ఒక చిన్న ద్వీపం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌లోని పోలీసులు తెలిపారు. విమానం సమీపంలోని సెయింట్ లూసియాకు వెళుతుండగా బెక్వియా సమీపంలోని పెటిట్ నెవిస్ ద్వీపానికి పశ్చిమాన జనవరి 4న ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఘటనలో నటుడు క్రిస్టియన్ ఆలివర్ తో పాటు ఆయన కుమార్తెలను మదితా క్లెప్సర్(10), అన్నీక్ క్లెప్సర్, (12)తో పాటు పైలట్ రాబర్ట్ సాక్స్ కూడా మరణించినట్టు అధికారులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదానికి కారణమేమిటో ఇంకా వెల్లడికాలేదు.

జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఆలీవర్ ‘ది గుడ్ జర్మన్’, 2008 లో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం ‘స్పీడ్ రేసర్’ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. గురువారం తన సొంత ప్లెయిన్ లో ప్రయాణిస్తున్న సమయంలో హఠాత్తుకు కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. విమానం కూలిపోయిన విషయాన్ని స్థానిక మత్స్యకారులు, కోస్టు గార్డులు, డైవర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటీకే విమానంలో ప్రయాణిస్తున్నవారు మరణించారు.