సుప్రీంకోర్టులో డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట

 సుప్రీంకోర్టులో  డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట

ఆమెరికా సుప్రీంకోర్టులో  డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట దక్కింది.  2020 ఎన్నికల ఓటమిని రద్దు చేయడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన క్రిమినల్ నేరారోపణల విచారణ చేయాలన్ని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం తిరస్కరించింది. కోర్టులోని ఆరుగురు సాంప్రదాయిక న్యాయమూర్తులు తీర్పుకు సపోర్ట్ చేయ.. ముగ్గురు న్యాయమూర్తులు విభేదించారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్‌, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నానని వివరించారు. ఈ నేపథ్యంలోనే హష్​ మనీ కేసులో ట్రంప్​ శిక్షను ఆలస్యంగా అమలు చేయమని న్యాయవాదులు న్యూయార్క్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.