అమెరికా టారిఫ్లతో ఎకానమీ నాశనం.. కేంద్రం స్పందించాలి: రాహుల్

అమెరికా టారిఫ్లతో ఎకానమీ నాశనం.. 	కేంద్రం స్పందించాలి: రాహుల్

న్యూఢిల్లీ: భారత్ పై ట్రంప్  విధించిన టారిఫ్ లపై కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ప్రతిపక్ష నేత  రాహుల్  గాంధీ డిమాండ్  చేశారు. అమెరికా  టారిఫ్ లతో మన ఎకానమీ నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటోమొబైల్  పరిశ్రమ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. 

గురువారం (ఏప్రిల్ 3) లోక్ సభలో జీరో అవర్ లో రాహుల్  మాట్లాడారు. ‘‘ఫారిన్  పాలసీ విషయంలో బీజేపీ, సర్కారుది  డిఫరెంట్  పాలసీ. ప్రతి విదేశీయుడి ముందూ తలవంచుతామని చెప్తాయి’ అని విమర్శించారు. 

అలాగే, భారత్ కు చెందిన 4 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, ఈ సమయంలో కేంద్రం ఆ దేశంతో 75 ఏండ్ల దౌత్య సంబంధాలపై సంబురాలు జరుపుకోవడం ఏమిటని తప్పుపట్టారు.