ప్లీజ్..మాకు కోడి గుడ్లు పంపించండీ:డెన్మార్క్ను రిక్వెస్ట్ చేస్తున్న అమెరికా

ప్లీజ్..మాకు కోడి గుడ్లు పంపించండీ:డెన్మార్క్ను రిక్వెస్ట్ చేస్తున్న అమెరికా

అమెరికా కోడి గుడ్ల కొరత ఎదుర్కొంటోంది. బర్డ్ ఫ్లూ కారణంగా గుడ్ల ఉత్పత్తి, సరఫరా బాగా తగ్గి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో పోరాడుతున్న అమెరికన్లకు ఇది పెద్ద షాక్. బేకింగ్ నుంచి ఆమ్లెట్లు తయారు చేయడం, పారిశ్రామిక ఆహార తయారీ వరకు అమెరికన్లకు చాలా అవసరం.దీంతో అమెరికా ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 

2025లో గుడ్ల ధరలు భారీగా పెరుగుతాయని అంచనా.. దాదాపు 41 శాతం పెరుగుతాయని రిపోర్టులు చెబుతున్నాయి.బేకింగ్ నుంచి ఆమ్లెట్లు తయారు చేయడం, ఆహార పదార్థాలు తయారు చేసే కంపెనీలు గుడ్ల సరఫరా చాలా అవసరం. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న అమెరికన్లకు గుడ్ల ఉత్పత్తి, సరఫరా కొరతతో ధరలు పెరిగి మరింత భారం కావొచ్చు. 

ALSO READ | సచిన్, అంబానీ, అమితాబ్, అక్షయ్... వీళ్లు తాగే పాలు ఏ కంపెనీవో తెలుసా.. లీటర్ ధర ఎంతంటే...!

గుడ్ల కొరతను ఎదుర్కొనేందుకు అమెరికా పక్క దేశాలను అభ్యర్థించాల్సిన పరిస్థితి.. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అమెరికా ఇప్పుడు డెన్మార్క్‌ సాయం కోసం విజ్ణప్తి చేసింది. ఈ దౌత్యపరమైన అభ్యర్థన రెండు దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు అమ్మాలని, నిరాకరించినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఆంక్షలు విధిస్తామని బెదిరించారు. గతంలో భౌగోళిక రాజకీయ శక్తిని ఉపయోగించి డెన్మార్క్‌పై ఒత్తిడి తెచ్చిన అమెరికా..ఇప్పుడు తమ కుటుంబాలను పోషించడానికి సహాయం కోరుతుండటం చర్చనీయాంశమైంది. 

అమెరికాలో ఈ గుడ్డు సమస్య ఇప్పటిది కానప్పటికీ ట్రంప్ జోక్యం పరిస్థితిని సంక్షోభాన్ని మరింత క్లిష్టతరం చేసింది.అమెరికన్లకు కిరాణా ఖర్చులను తగ్గిస్తానని మాటిచ్చిన ట్రంప్ కు  గుడ్డు ధరలు పెరగడం పెద్ద సవాల్ గా మారింది.