ట్రంప్ కూర్చి ఎక్కకముందే.. రండీ : భారతీయ విద్యార్థులకు అమెరికా అడ్వైస్

ట్రంప్ కూర్చి ఎక్కకముందే.. రండీ : భారతీయ విద్యార్థులకు అమెరికా అడ్వైస్

జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా డొలాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో అమెరికలో హైయిర్ స్టడీస్ చేయాలనుకున్న విద్యార్థులకు అమెరికన్ యూనివర్సిటీలు ప్రయాణ సలహాలను జారీ చేశాయి. హైయిర్ ఎడ్యుకేషన్ విదేశాల్లో చేయాలనుకునే వారి ఫస్ట్ చాయిస్ గా అమెరికా ఉంది. కానీ ట్రంప్ రాకతో వారిలో భయాలు ఎక్కువైయ్యాయి. రిప్లబ్లికన్ పార్టీ నుంచి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ, విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు విధిస్తారని సమాచారం. 

అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న భారతీయ విద్యార్థులు వీసా నిబంధలపై అనుమానాలు ఉన్నాయి. అందుకే చాలామంది ఇండియా వచ్చారు. ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కకముందే తిరిగి అమెరికా రావాలని ఆయా విశ్వవిధ్యాలయాలు విద్యార్థులకు సూచించాయి. జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్న అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ఇమ్మిగ్రేషన్ మరియు ఆర్థిక విధానాలను లక్ష్యంగా చేసుకుని తన మొదటి రోజు కార్యాలయంలో స్వీపింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లను అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 

Also Read :- ఫెంగల్ ఎఫెక్ట్: ఈదురుగాలుల బీభత్సం

2017లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఏడు ముస్లిం దేశాలకు చెందిన పౌరులు అమెరికాకు రాకుండా ఆంక్షలు పెట్టారు. అదే రీతిలో ఇప్పుడు కూడా  ఆంధోళనలు రేకెత్తిస్తున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్, అమ్హెర్స్ట్ లాంటి యూనివ్సరిటీలు అంతర్జాతీయ విద్యార్థులను జనవరి 20లో అమెరికాకి వచ్చేయాలని కోరుతూ అడ్వైజ్ జారీ చేశాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక సలహా ఇవ్వలేదు కానీ.. USలోని ఇండియన్ సిటిజన్స్ ప్రయాణ నిబంధనలపై ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని కోరారు.

2023, 24లో భారతదేశం నుంచి చైనా కంటే ఎక్కువ మంది విద్యార్థులు విదేశాల్లో విద్య కోసం వెళ్లారు. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్‌పై ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం.. 3లక్షల 31వేల 602 మంది భారతీయ విద్యార్థులు అమెరికన్ విద్యాసంస్థలలో జాయిన్ అయ్యారట. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 23 శాతం పెరుగింది.