శాస్త్రసాంకేతిక రంగంలో ఏఐ సునామి సృష్టిస్తోంది. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీ లాంఛ్ అయిన తర్వాత టెక్ ని విసృతంగా వినియోగించడం అలవాటు చేసుకుంటున్నారు. అన్నీ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడటం ప్రారంభిస్తున్నారు. సైన్యంలో కూడా అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుందని బ్లూంబర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.
ఫ్రిబవరి ప్రారంభంలో మధ్య ప్రాచ్యంలో వైమానిక దాడుల లక్ష్యాలను గుర్తించేందుకు అగ్రదేశమైన అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు ఈ రిపోర్ట్ లో ఉంది. యుద్ధ పరిస్ధితుల్లో ఏఐ వాడకాన్ని అమెరికా సైన్యం ప్రారంభించిందని తెలిపింది. వైమానిక దాడులకు లక్ష్యాలను గుర్తించేంఉదకు పెంటగాన్ కంప్యూటర్ విజన్ అల్గారిథమ్స్‌ను రంగంలోకి దించిందట.
మధ్య ప్రాచ్యాలో 85కిపైగా వైమానిక దాడులు ఏఐ అల్గారిథమ్స్ సాయంతోనే చేపట్టినట్టు తెలిపింది. లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో ఇరాక్, సిరియాలోని రాకెట్స్, మిసైల్స్, డ్రోన్ స్టోరేజ్, మిలీషియా ఆపరేషన్స్‌ను గుర్తించి టార్గెట్స్‌పై విరుచుకుపడింది. రక్షణ విభాగంలో ఆటోమేషన్ పెంచేందుకు 2017లో ఏర్పాటైన ప్రాజెక్ట్ మావెన్‌లో భాగంగా ఎయిర్‌స్ట్రైక్స్‌కు అవసరమైన అల్గారిథమ్స్‌ను అభివృద్ధి చేసినట్టు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ టెక్నాలజీ అధికారి మూర్ తెలిపారు.