
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసల నియంత్రణ చర్యలతో వేలాది మంది భారతీయుల అమెరికన్ కల మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. ఉపాధి ఆధారిత (EB) వలస వీసా వర్గాలకు సంబంధించిన కీలకమైన మార్పులు చేసింది. EB5 అన్ రిజర్వ్డ్ కేటగిరీలో భారత్ కు చుక్కెదురైంది. ఇది భారతీయులపై గణనీయమైన తిరోగమన ప్రభావాన్ని చూపుతుంది. H-1B ,గ్రీన్ కార్డ్ కోరుకునే భారతీయులకు ఇది మరింత చేదు వార్త.
యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ మే 2025 వీసా బులెటిన్‌ను విడుదల చేసింది. వలస వీసా వర్గాలకు ఉపాధి ఆధారిత (EB) ముఖ్యమైన అప్డేట్స్ను ప్రకటించింది. EB-5 అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో భారతదేశం ఆరు నెలలకు పైగా తిరోగమనాన్ని ఎదుర్కొంటుంది. చైనా జనవరి 22, 2014 నాటి స్థితిలోనే ఉంటుంది. మిగతా దేశాల స్థితిలో మార్పు లేదు. EB5 సెట్ అసైడ్ కేటగిరీలు అంటే గ్రామీణ, అధిక నిరుద్యోగం , మౌలిక సదుపాయాల కేటగీరిలో కూడా మార్పు ఏమీ ఉండదు.
మే 2025 US వీసా బులెటిన్ ప్రకారం.. EB-5 అన్‌రిజర్వ్డ్ వీసా కేటగిరీ ఆరు నెలలకు పైగా తిరోగమనాన్ని చూసింది. EB-3 వీసాలు కొద్దిగా ముందుకు సాగుతుంది. EB-1, EB-2 వీసాల్లో ఎలాంటి మార్పులు లేవు. EB-4 అందుబాటులో లేదు. సెట్-అసైడ్ EB-5 వర్గాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. బులెటిన్‌లో జాబితా చేయబడిన తుది చర్య తేదీల ఆధారంగా USCIS లో ఉపాధి ఆధారిత దరఖాస్తులు చేసుకోవచ్చు.
వీసా తిరోగమనం అంటే ఏమిటి
వీసా బులెటిన్‌లో వీసా లభ్యతను నిర్ణయించే ప్రాధాన్యత తేదీలను US డిపార్ట్‌మెంట్ ముందుకు తరలించడానికి బదులుగా వెనుకకు తరలించినప్పుడు వీసా తిరోగమనం అంటారు. తత్ఫలితంగా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఆలస్యం జరుగుతుంది. ప్రాధాన్యత తేదీ అంటే US పౌరసత్వం,ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వలసదారు పిటిషన్‌ను స్వీకరించే తేదీ. వీసా తిరోగమనం అంటే దరఖాస్తుదారులు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇది తాత్కాలికమే అయినప్పటికీ ఇది దరఖాస్తుదారులకు వేచి ఉండే సమయాన్ని గణనీయంగా పెంచుతుంది.
ఎందుకు జరుగుతుంది?
అమెరికా ప్రతి యేటా పరిమిత సంఖ్యలో వలస వీసాలు లేదా గ్రీన్ కార్డులను జారీ చేస్తుంది. ఒక దేశం లేదా వర్గం నుంచి దరఖాస్తుల సంఖ్య వీసా పరిమితిని మించిపోయినప్పుడు తిరోగమనం అమలు చేస్తుంది. గతంలో కొనసాగడానికి అర్హత ఉన్న దరఖాస్తుదారులు కూడా వారి ప్రాధాన్యత తేదీ అందుబాటులోకి రావడానికి ఎక్కువ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది.
తిరోగమనం ఎలా ప్రభావితం చేస్తుంది?
US వెలుపల ఉన్న దరఖాస్తుదారుల కంటే USలోని దరఖాస్తుదారులు తిరోగమనం ద్వారా భిన్నంగా ప్రభావితమవుతారు. USలో ఉండి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మీ ప్రాధాన్యత తేదీ మళ్లీ ప్రకటించే వరకు మీ దరఖాస్తు పాజ్ చేయబడుతుంది. US వెలుపల ఉంటే వీసా ఇంటర్వ్యూ ప్రాధాన్యత తేదీ వచ్చే వరకు షెడ్యూల్ చేయలేరు. మీరు ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం దాఖలు చేసి ఉపాధి అధికార పత్రం (EAD) లేదా అడ్వాన్స్ పెరోల్ (AP) పొందినట్లయితే వేచి ఉన్నప్పుడు పని కొనసాగించవచ్చు.
►ALSO READ | మరీ ఇంత మూర్ఖత్వమా..! ఆడపిల్ల పుట్టిందని భార్యను స్క్రూడ్రైవర్తో అటాక్ చేశాడు