ఇరాన్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ప్రమాదకర కార్యకలాపాలలో అమెరికా పాల్గొనదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెప్పినట్లు సమాచారం. ఇద్దరు నాయకులు ఫోన్‌లో చర్చించినట్టు తెలుస్తుంది. ఇరాన్‌పై ఎదురుదాడికి వాషింగ్టన్ మద్దతు ఇవ్వదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చెప్పినట్లు నివేదికలపై, భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్ స్పందించారు.
" బిడెన్ ఇజ్రాయెల్ కు చాలా మద్దతిస్తున్నారు. తాము దానిని చాలా అభినందిస్తున్నాము. కానీ శాంతి భద్రత విషయంలో ఇజ్రాయెల్ దాని సొంత నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది, తాము ఖచ్చితంగా అమెరికాను సంప్రదిస్తామని కానీ అంతిమ నిర్ణయం మాత్రం ఇజ్రాయెల్ దే అని నౌర్ గిలోన్ చెప్పారు.
#WATCH | Delhi: On reports which state that US President Joe Biden told Israeli PM Benjamin Netanyahu that Washington won't back a counterattack on Iran by Israel, Ambassador of Israel to India Naor Gilon says, "First of all we have to say that Biden and the US were so supportive… pic.twitter.com/Qafi8CKGuk
— ANI (@ANI) April 14, 2024
మరోవైపు ఆదివారం (ఏప్రిల్ 14) దాడి చేసింది. వందలాది డ్రోన్లు,క్షిపణులతో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్ అంతటా బూమ్ లు, వైమానిక దాడి సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దశాబ్దాల శతృత్వం ఉన్నప్పటికీ ఇరాన్..ఇజ్రాయెల్ పై ప్రత్యక్ష సైనిక దాడి చేయడం ఇదే మొదటి సారి. ఇరాన్ డ్రోన్లు, క్యూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణు లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ మిలిటరీ ధృవీకరించింది.
దక్షిణ ఇజ్రాయెల్ లోని బెడౌన్ అరబ్ పట్టణంలో క్షిపణీ దాడిలో పదేళ్ల బాలిక తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు.మరో క్షిపణి ఆర్మీ బేస్ ను ప్రయోగించారని..స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఎవరికి గాయాలు కాలేదని ప్రకటించింది. ఇరాన్ దాడులను చాలావరకు సమర్థవంతంగా తిప్పికొట్టామని ప్రకటించారు.