14 ఏళ్ల బాలుడిని లోబరుచుకొని ప్రెగ్నెంట్ అయిన 23 ఏళ్ల యువతి

అమెరికాలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్కాన్సాస్‌‌కు చెందిన బ్రిట్నీ గ్రే అనే 23 ఏళ్ల యువతి ఏడాది క్రితం 14 ఏళ్ల బాలుడిని లోబరచుకుంది. అప్పటి నుంచి బాలుడితో సన్నిహితంగా మెలుగుతోంది. దాంతో ప్రస్తుతం ఆ యువతి గర్భవతి అయింది. అయితే మైనర్‌తో పిల్లల్ని కనడం అమెరికాలో చట్టరిత్యా నేరం. దాంతో ఒక వ్యక్తి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి.. బాలుడి వల్లే గ్రే గర్భవతి అయినట్లు పోలీసులు నిర్దారించారు. దాంతో ఆమెను పోలీసులు మార్చి 1న అరెస్టు చేశారు. అయితే గ్రే 5 వేల డాలర్ల పూచికత్తు సమర్పించడంతో ఆమెను విడుదల చేశారు. తిరిగి గ్రే ఏప్రిల్ 23న కోర్టుకు హాజరుకానుంది.