డిగ్రీ పట్టా అందుకునే రోజు ఎవరికైనా జీవితంలో మర్చిపోలేని రోజు. టీచర్లు, తల్లిదండ్రులు, ఫ్రెండ్స్ చప్పట్లు కొడుతుంటే స్టేజీ మీదకు వెళ్లి సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. జడా సెలెస్ కూడా ఆ ఆనందాన్ని మిస్ కావద్దు అనుకుంది. అమెరికాలోని డిల్లార్డ్ యూనివర్సిటీలో డిప్లొమా చేసింది. అయితే అప్పటికే ఆమె తొమ్మిది నెలల గర్బిణి. అయినా సరే... ఎలాగైనా డిప్లొమా కాన్వకేషన్ సెర్మనీకి వెళ్లాలి అనుకుంది. కానీ, పురిటినొప్పులు రావడంతో సెలెస్ని కాన్వకేషన్ సెర్మనీకి ముందు రోజే (ఈనెల 13న) హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తెల్లారే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన సంతోషం ఒక వైపు, కాన్వకేషన్ ఈవెంట్‌కి వెళ్లలేకపోయాననే బాధ మరోవైపు ఆమెలో. తాను కాన్వొకేషన్‌కి ఎందుకు రాలేకపోయిందో యూనివర్సిటీ డైరెక్టర్ వాల్టర్ కిమ్బ్రోగ్కి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చదివిన ఆయన సెలెస్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. ఆమె ఉన్న హాస్పిటల్‌కి వెళ్లాడు. కాన్వకేషన్ వేడుకలో ఎలాగైతే పేరు చదువుతారో.. అలానే సెరెస్ పేరు చదివి, డిప్లొమా పట్టా అందించాడు. కాన్వకేషన్ గౌన్ వేసుకుని, తలపై టోపీ పెట్టుకుని డిప్లొమా పట్టా అందుకుంది. ఒక చేతిలో బిడ్డ. మరో చేతిలో డిప్లొమా పట్టా పట్టుకొని మురిసిపోతున్న సెలెస్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
హాస్పిటల్లో డిప్లొమా పట్టా
- లైఫ్
- May 23, 2022
మరిన్ని వార్తలు
-
కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతోనే ఎందుకు దీపారాధన చేయాలి..
-
Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
-
Happy Children's Day Special : పిల్లలతో ఇలా గడపండి.. సంతోషం మీ వెంటే.. రోజుకు కనీసం ఓ గంట..!
-
కార్తీక పౌర్ణమి: 365 వత్తులు వెలిగిస్తూ చదవాల్సిన మంత్రం ఇదే ..
లేటెస్ట్
- స్టూడెంట్లతో సీఎం మాక్ అసెంబ్లీ
- సమ సమాజ మార్గదర్శి గురునానక్
- ఢిల్లీ మేయర్‌గా మహేశ్ ఖించీ
- మున్సిపాలిటీల అప్పులూ ఎక్కువే
- సూర్యాపేట మార్కెట్ లో గందరగోళం
- మోదీ తన జీవితంలో ఎప్పుడూ రాజ్యాంగం చదవలే : రాహుల్ గాంధీ
- ఎస్సారెస్పీ స్టేజ్2, నీల్వాయిపై
- శ్రీలంకలో ముగిసిన ఓటింగ్
- తెలంగాణ నేపథ్యంలో డిటెక్టివ్ వికటకవి : ఫేమ్ ప్రదీప్ మద్దాలి
- ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది .. దాడికి కుట్ర చేస్తున్నా గుర్తించరా : సీఎం రేవంత్
Most Read News
- Lucky Baskhar OTT: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేయాలి.. తల స్నానం ఎలా చేయాలి.. రాత్రి సమయంలో ఏం చేయాలి..
- Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీలో సరికొత్త చరిత్ర.. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ట్రిపుల్ సెంచరీలు
- సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన హైడ్రా కమిషనర్
- AUS vs IND: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ ఇద్దరే ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిపించగలరు: ఆసీస్ దిగ్గజ క్రికెటర్
- పిల్లలూ చిల్డ్రన్స్ డే గుడ్‌న్యూస్.. పరీక్షల్లో 15 శాతం సిలబస్ తగ్గింపు
- Kanguva OTT: ఓటీటీలోకి కంగువ.. భారీ మొత్తానికి డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Happy Children's Day Special : ఈ పిండి వంటలు వండి పెట్టండి.. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..!
- Ranji Trophy 2024-25: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన షమీ
- కంగువ ఎఫెక్ట్ పుష్ప 2 పై పడిందా.? అందుకే తమన్ ని తీసుకున్నారా..?