టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే తప్పగ గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్.. అమెరికాతో తలపడుతోంది. కెన్సింగ్టన్ ఓవల్(బార్బడోస్) వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు సారథి జోస్ బట్లర్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. భారీ విజయం సాధించాల్సి ఉండటంతో.. అమెరికన్లు నిర్ధేశించే లక్ష్యాన్ని బట్టి బ్యాటింగ్ చేయవచ్చనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.
సూపర్-8 తొలి పోరులో వెస్టిండీస్‌ను ఓడించిన ఇంగ్లాండ్.. అదే దూకుడు కనపరచలేకపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా ఓడింది. దీంతో ఈ మ్యాచ్‌లో వారు తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఓడితే ఇంటిదారి పట్టాల్సిందే.
తుది జట్లు
యునైటెడ్ స్టేట్స్: స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్(వికెట్ కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్(కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కెప్టెన్/ వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ