టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. గురువారం(జూన్ 06) డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైయరీ స్టేడియం వేదికగా ఆతిథ్య జట్టు అమెరికాతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
అరగంట చాలు
కాగా, ఇవాళ జరిగే మ్యాచ్ లో పాకిస్థాన్‌ను ఓడిస్తామని అమెరికా కెప్టెన్ మోనాన్క్ పటేల్ ధీమా వ్యక్తం చేశాడు. మైదానంలో 30 40 నిమిషాలు మెరుగైన ప్రదర్శన చేస్తే ప్రత్యర్థిని ఓడించడం అంత కష్టమేమి కాదని అన్నాడు. మరి అమెరికా ఎలాంటి ప్రదర్సన చేస్తుందో కాసేపట్లో తేలనుంది.
తుది జట్లు
పాకిస్తాన్: బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ అమీర్, హరీస్ రవూఫ్.
యునైటెడ్ స్టేట్స్: స్టీఫెన్ టేలర్, మొనాక్ పటేల్(కెప్టెన్, వికెట్ కీపర్), అండ్రిస్ గౌస్, అరోన్ జోన్స్, నితిశ్ కుమార్, కొరే అండర్సన్, హర్మీత్ సింగ్, జస్దీప్ సింగ్, నొస్తుశ్ కెంజిగే, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్.