వాషింగ్టన్: విదేశీ సహాయ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేసిన యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్ఏఐడీ)పై ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్, అమెరికా ప్రెసిడెంట్డొనాల్డ్ట్రంప్ విరుచుకుపడ్డారు. అదో నేర సంస్థ అని ఎలాన్ మస్క్విమర్శించారు. అమెరికన్లు చెల్లిస్తున్న పన్నులతో యూఎస్‌ఏఐడీ సంస్థ విదేశాల అభివృద్ధికి ఆర్థిక సహాయం చేస్తున్నదని, వారు ఆ డబ్బుతో కొవిడ్ వంటి ప్రమాదకర వ్యాధులను పుట్టించడానికి పరిశోధనలు చేస్తున్నారని మస్క్ ఆరోపించారు.
కాగా, యూఎస్ఏఐడీని రాడికల్మూర్ఖులు నడుపుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. వారిని వెంటనే తొలగించి, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, యూఎస్ఏఐడీని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కిందకు తీసుకురావాలని ట్రంప్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్స్ వెల్లడించాయి.