మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణలోని ప్రకృతి సంపద, సంస్కృతి సాంప్రదాయాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయని యునైటెడ్ స్టేట్స్ పాల్ గ్రోవ్, క్లర్క్, సెనేట్ కమిటీ కొనియాడింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, పోచారం, మెదక్ ప్రాంతాల్లోని అడవులను ఈ ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. ఫారెస్ట్, ప్లాంటేషన్, టూరిజం యాక్టివిటీస్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ రాహుల్ రాజ్‌తో కమిటీ సభ్యులు మాట్లాడారు. తెలంగాణలోని పర్యావరణ, పర్యాటక శిబిరాలు అద్భుత ప్రతిభా పాటవాలు నేర్పుతాయన్నారు. ఈ పర్యటనలో పాల్ రాడెమాకర్, మార్క్, వర్గీస్ పాల్, ఫారెస్ట్ డిపార్టుమెంట్ చీఫ్ కన్జర్వేటర్ సి.శరవణన్, యూఎస్ఏఐడీ, ఫారెస్ట్ -ప్లస్ టీమ్ డాక్టర్ ఉజ్వల్ ప్రధాన్, ఆశిష్ రాజ్. గైని సాయిలు తదితరులు పాల్గొన్నారు.