జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్‌కు చేదుఅనుభవం ఎదురైంది. ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 12.7 మిలియన్ డాలర్లు (దాదాపు. రూ. 103 కోట్లు) మాయమయ్యాయి. ఆ డబ్బంతా బోల్ట్ లైఫ్‌టైమ్ సేవింగ్స్ అని అతని లాయర్ చెప్పారు. బోల్ట్ 2012లో జమైకన్ బ్రోకరేజీ ఫార్మ్ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో అకౌంట్ ఓపెన్ చేసి రిటైర్మెంట్, లైఫ్ టైమ్ సేవింగ్స్ కేటగిరీలో పెట్టుబడి పెట్టాడు. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఈ ఆర్థిక నేరానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
12.7 మిలియన్ డాలర్లు ఉండాల్సిన అకౌంట్ లో ప్రస్తుతం 12000 డాలర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించిన బోల్ట్ వెంటనే లాయర్ ను సంప్రదించాడు. ఆ డబ్బును తన అనుమతి లేకుండా కొట్టేశారని బోల్ట్ కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. 10 రోజుల గడువిచ్చి ఆలోగా డబ్బు రికవరీ చేయాలని బ్రోకరేజీ ఫార్మ్ కు సూచించారు.