సింప్టమ్స్ లేకున్నా యాంటీ బయోటిక్స్ వాడేస్తున్నరు!

సింప్టమ్స్ లేకున్నా యాంటీ బయోటిక్స్ వాడేస్తున్నరు!

స్వల్ప లక్షణాలకు కూడా వాటినే రాస్తున్న డాక్టర్లు
అతిగా వాడటం ప్రమాదమంటున్న ఎక్స్‌‌పర్స్ట్
రాష్ట్రంలో సాధారణంగా నెలకు రూ. 700 కోట్లవ్యాపారం..
ఇప్పుడు రూ. 1200 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా భయంతో రాష్ట్రంలో యాంటీ బయోటిక్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. లక్షణాలు ఉన్నా, లేకున్నా జనం వీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ ‌లో రూ. వంద కోట్లకు పడిపోయిన యాంటీ బయోటిక్స్ వ్యాపారం జూన్‌‌లో రూ. 500 కోట్లకు చేరి, జులై నాటికి వెయ్యి నుంచి 12 వందల కోట్లకు చేరుకుంది. సాధారణ రోజుల్లో రాష్ట్రంలో నెలకు
రూ. 700 కోట్ల వ్యాపారం జరుగుతుంది. చిన్న జ్వరం వచ్చినా, సర్ది అనిపించి నా కరోనా భయంతో జనం యాంటీ బయోటిక్స్ ‌‌వేసుకుంటున్నారు.కొందరు పూర్తి ఆరోగ్యవంతులు కూడా ఎందుకైనా మంచిదని వీటిని వాడుతున్నారు. మెడికల్ ‌‌షాపుల వాళ్లు కూడా యథేచ్ఛగా అమ్ముతున్నారు. మెడికల్ షాపులో ఇవ్వకపోతే జనం ఆన్‌‌లైన్‌‌లో కొంటున్నారు. కొందరు డాక్టర్లు కూడా జ్వరం, సర్ది, దగ్గు లాంటి లక్షణాలతో పేషెంట్లు వస్తే ఇవే రాస్తున్నారు. ఈ ట్రెండ్‌‌ ను చూస్తున్న
హెల్త్ ఎక్స్ ప‌ర్ట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు యాంటీ బయోటిక్స్ ‌వాడితే శరీరానికి రెసిస్టెన్స్ ‌‌వచ్చి భవిష్యత్తులో ఆ మందులు పని చేయకుండా పోతాయని అంటున్నారు.

ముందు జాగ్రత్త పేరిట..

కరోనా పేషెంట్స్ కి డాక్టర్స్ రాస్తున్న ప్రిస్కిప్షన్ లో అజిత్రో మైసిన్, ఎరిత్రో మైసిన్, లివో ఫ్లాక్ సిన్ వంటియాంటీ బయోటిక్స్ తో పాటు డోలో, పారాసిటమాల్, లిమ్సీ , జింకో విట్, బికోవిట్ వంటివి ఉంటున్నాయి. మామూలు జనం కూడా ఈ మందుల గురించి తెలుసుకొని కరోనా రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా వాడుతున్నారు. సాధారణంగా డాక్టర్లు దగ్గు, సర్ది లాంటి పేషెంట్లకు యాంటీ బయోటిక్స్ ‌‌కన్నా యాంటీ ఎలర్జిటిక్ ‌‌మందులు రాస్తుంటారు. ఆవిరి పట్టుకోవాలని సూచిస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భయంతో జనం, రిస్క్ ‌‌ఎందుకని డాక్టర్లు యాంటీ బయోటిక్స్‌‌ను ప్రిఫర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి కోట్ల నుంచి 12 వందల కోట్లుగా ఉన్న యాంటీ బయోటిక్స్ ‌‌వ్యాపారంలో ట్యాబ్లెట్లతోపాటు ఇంజెక్షన్లు కూడా ఉన్నాయి. బ్రీథింగ్‌‌ ప్రాబ్లమ్‌ ఉన్నవాళ్లు, లంగ్స్ ‌‌ఇన్ఫెక్ట్ ‌‌అయిన వాళ్ల‌కు ఇంజెక్షన్లు వాడుతున్నారు. వీటి ఖరీదు రెండు, మూడు వేల నుంచి మొదలవుతుంది. హాస్పిటళలో చేరిన వాళ్లు తప్ప మిగతా వాళ్లు ఇంజెక్షన్లు వాడడం లేదు. దీన్నిబట్టి
చూస్తే ట్యాబ్లెట్ల వాడకమే ఎక్కువగా ఉంది.

ఇష్టం వచ్చినట్లు వాడొద్దు ..

‘‘ఏ యాంటీ బయోటిక్స్‌‌అయినా డాక్టర్స్ సూచించిన దాని ప్రకారం వాడాలి. చాలామంది ఇష్టానుసారంగా యూజ్‌ చేస్తున్నారు. దాని వల్ల ఫ్యూచర్ లో బాడీ మీద చెడు ప్రభావం పడుతుంది. కొన్ని మందుల వల్ల లివర్‌ ఎఫెక్ట్ ‌అవుతుంది. కిడ్నీకి కూడా ప్రాబ్లమ్‌ అవుతుంది. రోగి కండీషన్‌‌, మెడికల్ ‌‌హిస్టరీని బట్టి మందులు రాస్తం. కొందరికి యాంటీ బయోటిక్స్‌‌అవసరం అవుతుంది. ఇంకొందరికి కాదు. కొందరికి అవసరమైనా ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. అన్నీ చూసుకొని ట్రీట్‌‌మెంట్ ‌‌ఇస్తం. అంతేకాని ఎవరి ఇష్టానుసారం వాళ్లు యాంటీ బయోటిక్స్ ‌‌వాడితే ప్రమాదమే. బాడీని రెసిస్టెన్స్ ‌‌వచ్చి భవిష్యత్తులో ఆ మందులు వారి మీద ప్రభావం చూడకుండా పోతుంది’’ అని సికింద్రాబాద్‌‌లో క్లినికల్ నిర్వహిస్తున్న డా‌క్ట‌ర్ ప్రసాద్ ‌‌హెచ్చరించారు. ‘‘జనరల్‌‌గా యాంటీ బయోటిక్స్ ‌కొన్ని సీజన్లలోనే అమ్ముతాం. ఎందుకంటే కొన్ని సీజన్లలో బ్యాక్రియాటీ ఇన్ఫెక్షన్ ‌‌ఎక్కువగా ఉన్నపుడు డాక్టర్లు వాటిని ప్రిస్క్రైబ్ ‌చేస్తారు. మామూలు రోజుల్లో చాలా తక్కువ. ప్రస్తుతం కరోనా సీజన్లో చాలా మంది యాంటీ బయోటిక్స్‌‌ కోసం వస్తున్నారు. రోజు 15–20 మందైనా అడుగుతున్నారు. కానీ ప్రిస్క్రిప్షన్ ‌లేకుండా ఇవ్వడంలేదు’’ అని హైదరాబాద్ నేరెడిమెట్‌‌లోని మెడికల్ ‌‌షాప్ ‌‌ఓనర్ ‌బుచ్చిబాబు చెప్పారు. హైటెక్‌‌ సిటీలో మెడికల్ ‌షాప్ ‌‌నిర్వహిస్తున్న సాగర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘జనరల్‌‌గా యాంటీ బయోటిక్స్‌‌ మూడు నుంచి ఐదు రోజుల కోసం డాక్టర్లు సజెస్ట్‌‌ చేస్తారు. కానీ కొందరు ఎక్కువ రోజుల కోసం అడుగుతున్నారు. మేంప్రిస్క్రిప్ష
న్ ‌‌అడుగుతున్నం. అది ఉంటేనే అమ్ముతున్నం’’ అని ఆయన చెప్పారు. ఆన్‌‌లైన్‌‌లో వచ్చిన ఆర్డర్లు కూడా ప్రిస్క్రిప్షన్ ‌‌చూపిన తర్వాతే మెడిసిన్స్ ఇస్తున్నామంటున్నారు.