అన్ని టెంపుల్స్లో నందిని నెయ్యి వాడాలి:కర్ణాటక ప్రభుత్వం

అన్ని టెంపుల్స్లో నందిని నెయ్యి వాడాలి:కర్ణాటక ప్రభుత్వం

టీటీడీ లడ్డూ కల్తీ వివాదం కర్ణాటకకు పాకింది. వరల్డ్ ఫేమస్ టెంపుల్ తిరుపతిలో లడ్డూ తయారీ నెయ్యిలో కల్తీపై వివాదం తలెత్తిన క్రమంలో ఆలయాల్లో లడ్డూ తయారీకి నెయ్యి వాడకంపై కీలక నిర్ణయం తీసుకుంది..ఇకపై కర్ణాటక లోని అన్ని దేవాలయాల్లో ప్రభుత్వం డెయిరీ నందినీ నెయ్యిని మాత్రమే వాడాలని ఆదేశిం చింది. కర్ణాటకలోని దాదాపు 34వేల దేవాలయాలున్నాయి.. ఈ దేవాలయాల్లో నందిని బ్రాండ్ నెయ్యిని మా్తరమే వాడాలని కర్ణాటక ప్రభుత్వం శనివారం ( సెప్టెంబర్ 21) ఆదేశాలు జారీ చేసింది. 

కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, ప్రసాదం తయారీ, దాసోహ భవనాలు వంటి ఆలయ ఆచారాలకోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఉత్పత్తి చేసే నంది నెయ్యిని మాత్రమే ఉపయోగించాలి. భక్తులకు అన్నదానం, ప్రసాదం నాణ్యతలో ఎప్పుడూ రాజీ పడకుండా ఆలయ సిబ్బంది తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారికంగా సర్క్సులర్ జారీ చేశారు. 

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ ఆలయంలో వినియోగించే నెయ్యి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. శాంపిల్స్ లో నెయ్యి కల్తీ అయిందని రిపోర్టు వచ్చాయి. రోజూ దాదాపు 3 లక్షల లడ్డూలను తయారు చేసే తిరుపతి దేవస్థానం వంటగది 15వేల కిలోల నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, యాలకులు, శెనగపండి, పంచదార వంటి నిత్యావసర వస్తువులను ఉపయోగిస్తారు. వివాదాస్పదమైన ఈ నెయ్యి తమిళనాడులోని దిండిగల్ జిల్లా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. 

ALSO READ :తిరుమల లడ్డూ వివాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి: ఏపీ విశ్వహిందూ పరిషత్

ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడంతో వాగ్వాదం మరింత ముదిరింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతి లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యి నాసిరకంగా ఉందని, సంప్రదాయ నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఆరోపణలను మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు, అధికార టిడిపి ఈ సమస్యను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.