
హనుమకొండ సిటీ, వెలుగు : అభివృద్ధికి అడ్డంకిగా మారుతున్న మత్తు పదార్థాలను, వాటి వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం జరిగిన రివ్యూలో ఆమె మాట్లాడారు. స్టూడెంట్లు, యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట స్కూళ్ల పరిసర ప్రాంతాలపై ఆఫీసర్ల పర్యవేక్షణ ఉండాలన్నారు. పిల్లల ప్రవర్తనపై టీచర్లు, పేరెంట్స్ దృష్టి పెట్టాలని చెప్పారు. స్కూల్‌కు 100 మీటర్ల దూరంలో వైన్స్ లేకుండా చూడాలన్నారు. అనంతరం మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలు, వాటికి బానిసలుగా మారిన వారి ప్రవర్తన, తీసుకోవాల్సి జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్, వెల్ఫేర్ ఆఫీసర్ మధురిమ, సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్, డీపీవో జగదీశ్వర్, డీఎంహెచ్‌వో బి.సాంబశివరావు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
ALSO READ:-తెలంగాణలో ప్రజా దర్బార్ ఎలా, ఎప్పుడు పుట్టింది.. నాగోబా జాతరతో లింకేంటీ..?