న్యూఢిల్లీ: ట్రాన్సాక్షన్ ఛార్జీలు విధిస్తే యూపీఐని వాడడం ఆపేస్తామని 75 శాతం మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. లోకల్‌సర్కిల్స్ చేసిన సర్వే ప్రకారం, 38 శాతం మంది తమ పేమెంట్ ట్రాన్సాక్షన్లలో సగం యూపీఐ ద్వారానే చేస్తున్నారు. 22 శాతం మంది ట్రాన్సాక్షన్ ఫీజులు వేసినా పర్వాలేదని పేర్కొన్నారు. దేశంలోని 308 జిల్లాల్లోని 42 వేల రెస్పాన్స్‌ల ఆధారంగా ఈ సర్వేను లోకల్ సర్కిల్స్ చేసింది.
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఫీజుకు సంబంధించి 15,598 రెస్పాన్స్‌లు అందాయి. కాగా, కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.139.1 లక్షల కోట్ల విలువైన 13,100 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి.