
లక్ష్మణచాంద, వెలుగు: జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి సొంత బాబాయ్ ఇంట్లోనే చోరీకి పాల్పడి జైలుపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం నిర్మల్ లో డీఎస్పీ గంగారెడ్డి వెల్లడించారు. బాబాపూర్ గ్రామానికి చెందిన హాలిమా బేగం భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ కి వెళ్లగా ఆమె పిల్లలతో ఇంటి వద్ద ఉంటోంది. మూటపూర్లో ఉండే తన తమ్ముడి ఇంట్లో ఫంక్షన్గత శుక్రవారం పంక్షన్ ఉండగా హాలిమా బేగం అక్కడికి వెళ్లింది.
దీంతో పక్కింట్లో ఉండే హాలిమా బేగం బావ కొడుకు అల్లాహుద్దీన్ఆ ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు నాలుగు తులాల బంగారం, రూ.75 వేల నగదు ఎత్తుకెళ్లిపోయాడు. హాలిమా బేగం శనివారం ఉదయం తిరిగి వచ్చి చూడగా.. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మణచాంద ఎస్సై శ్రీకాంత్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ALSO READ :- అక్టోబర్1న పాలమూరు, 3న ఇందూరులో సభలు : కిషన్ రెడ్డి
సోమవారం ఎస్సై సిబ్బందితో బాబాపూర్ నుంచి న్యూ లింగంపల్లి వెళ్తుండగా దారిలో బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న అల్లాహుద్దీన్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో చోరీ విషయాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి దగ్గర నుంచి చోరీ చేసిన నగలు, నగదుతోపాటు బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదించిన సోన్ సీఐ నవీన్ కుమార్,ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని అభినందించారు.