
హైదరాబాద్, వెలుగు: యూఎస్, ఇండియా మధ్య వాణిజ్యాన్ని పెంచేందుకు ఇండియా చాప్టర్‌ను యూఎస్ గ్లోబల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (యూఎస్‌జీసీఐ) అందుబాటులోకి తెచ్చింది. దీనిని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అడ్వైజర్ మార్క్ బర్న్స్ లాంచ్ చేశారు.
ఇంధన అవసరాలను తీర్చుకోవడంపై ఇరు దేశాలు ఫోకస్ పెట్టాయని ఆయన అన్నారు. ఇండియాకు టాప్ ఎల్‌ఎన్‌జీ సప్లయర్‌గా యూఎస్ నిలుస్తుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మెరుగుపరచడంపై యూఎస్‌జీసీఐ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది.