క్యాడ్బెరీ జెమ్స్ తిన్నంత ఈజీగా డోలో 650 వాడుతున్నారు: డాక్టర్ కామెంట్స్ వైరల్

క్యాడ్బెరీ జెమ్స్ తిన్నంత ఈజీగా డోలో 650 వాడుతున్నారు: డాక్టర్ కామెంట్స్ వైరల్

దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా గుర్తొచ్చే ట్యాబ్లెట్ డోలో-650. కరోనా తర్వాత అంత పాపులారిటీ సంపాదించింది ఈ ట్యాబ్లెట్. ఒకప్పుడు ప్యారాసిటమాల్ వాడేవాళ్లు. కానీ ఇప్పుడు తుమ్మినా దగ్గినా డోలో 650 మింగాల్సిందే అన్నట్లుగా తయారైంది పరిస్థితి. డాక్టర్ సలహా కూడా తీసుకోవడం మానేశారు జనం. డైరెక్ట్ గా మెడికల్ షాప్ కు వెళ్లి ‘‘అన్నా ఒక స్ట్రిప్ డోలో650 ఇవ్వండి’’ అని అడ్వాన్స్ గా ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇండియాలో ఈ ట్యాబ్లెట్ వాడకంపై ఒక డాక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై ఫుల్ కామెంట్స్.. రిప్లైలు.. షేరింగ్ లతో మిలియన్ వ్యూస్ కు వెళ్లింది. 

యూఎస్ లో ఉండే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా.పలనిప్పమ్ మానిక్యమ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. ‘‘ఇండియన్స్ డోలో-650 ట్యాబ్లెట్ ను క్యాడ్ బెరీ జెమ్స్ తిన్నంత ఈజీగా వాడుతున్నారు’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు. పారాసిటమాల్ బ్రాండ్ అయిన డోలో-650 పై ఇండియన్స్ ఆధారపడటంపై కాస్త వ్యంగ్యంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండింగ్ సబ్జెక్ట్. పోస్ట్ చేసిన వెంటనే ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీనిపై మీమ్స్, రీట్వీట్స్, నవ్వులు మొదలయ్యాయి. వేల సంఖ్యలో లైక్స్, రీట్వీట్స్ వచ్చాయి. చాలా మంది తాము కూడా ఏదైనా అన్ ఈజీ అనిపించినపుడు ఒక స్ట్రిప్ డోలో తెచ్చుకోవడం ఈ మధ్య కామన్ అయ్యిందని రిప్లై ఇస్తున్నారు. 

మధురైలో పుట్టిన డాక్టర్ పాల్.. కాలిఫొర్నియా లోని సాక్రిమెంటో ఇన్ స్టిట్యూట్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఒకవైపు గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తూనే ‘మెడ్--కామ్’ అనే కామెడీ ప్లా్ట ఫామ్ ను నడిపిస్తున్నాడు. ప్రజలకు తెలియాల్సిన చాలా ఆరోగ్య, వైద్య సంబంధిత విషయాలను కామెడీ రూపంలో చెప్తుండటంతో పాపులర్ ఫిగర్ అయ్యాడు. 

కామెడీ వెనుక సీరియస్ మెసేజ్:

డోలో 650 వాడకం క్యాడ్ బెరీ జెమ్ వాడినంగా ఈజీగా ఉంది ఇండియాలో అనటం కామెడీగా అనిపించినా.. దీని వెనుక సీరియస్ మెసేజ్ ఉందనే సంగతి మనం మరిచిపోకూడదు. ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, జలుబు.. ఇలా చిన్న చిన్న సమస్యలకు ఈ ట్యాబ్లెట్ వాడకం అంత మంచిది కాదని చెబుతున్నాడు. ఎలా పడితే అలా వాడటానికి అది క్యాండీ కాదు. కెమికల్ సబ్ స్టెన్స్ తో తయారైన ట్యాబ్లెట్. 

చిన్నదానికి పెద్దదానికి వాడితే బాడీలో చాలా వరకు డయాగ్నోసిస్ ప్రాబ్లమ్స్ వస్తాయని హెచ్చరించాడు. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇష్టం వచ్చినట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ రావడంతోపాటు.. బాడీలో ఇమ్యూనిటీ పవర్ (రోగనిరోధక శక్తి) తగ్గుతుంది. అంటే ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీ దానికదే క్యూర్ చేసుకునే వ్యవస్థను కోల్పోతుంది. దీంతో మందులు లేకుండా బాడీ నడవదు. సో బీ కేర్ఫుల్.