
ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేసిన దారుణమైన జోకులపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నీ బూత్ జోకులు ఏమైనా ప్రతిభ అనుకుంటున్నావా అని రణవీర్ కామెంట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం రేపిన రణవీర్ మాటలు పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై సోమవారం (మార్చి 3) సుప్రీంకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఎనిమిది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న బీర్ బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఓనర్ రణవీర్ అల్లాబాడియా ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ఓ కంటెస్టెంట్ తో జరిగిన సంభాషణలో ‘‘మీ తల్లిదండ్రులు ప్రతిరోజూ సెక్స్ చేయడం జీవితాంతం చూస్తారా లేదా ఒక్కసారి సెక్స్ లో పాల్గొని శాశ్వతంగా ఆపేస్తారా?" అని అడగడం వివాదం రేపింది.
Also Read :- రికార్డులు సృష్టించిన వేశ్య కథ
ఫిబ్రవరి 9న ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. పోలీసు కేసులు, రణవీర్ ను చంపుతామని బెదిరింపులు వచ్చాయి. యూట్యూబ్ ఆ ఎపిసోడ్‌ను వెంటనే తొలగించింది. అయినా అది అల్లాబాడియా ,షోపై వచ్చిన ఆగ్రహాన్ని ఆపలేకపోయింది. .