కారేపల్లి, వెలుగు: మండలంలోని ఉసిరికాయలపల్లి రెవెన్యూ పరిధిలోని వివాదాస్పద భూమిని కారేపల్లి మండల రెవెన్యూ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఉసిరికాయలపల్లికి చెందిన పచ్చిపాల భద్రయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భూమి గురించి రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.
548/37/అ/4 సర్వే నంబర్ లో భద్రయ్య పేరుతో ఉన్న పట్టాభూమి వివరాలను సేకరించారు. తహసీల్దార్ సంపత్ కుమార్, ఆర్ఐ జార్జ్, ఎస్ఐ రాజారాం, సర్వేయర్ తో కూడిన రెవెన్యూ బృందం స్థానిక రైతులను అడిగి వివరాలు తెలుసుకుంది. నివేదికను కలెక్టర్ కు పంపనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.