హైదరాబాద్ సిటీ, వెలుగు:సిటీ జంట జలాశయాలకు భారీగా వరద కొనసాగుతోంది. పదేండ్ల తర్వాత ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు మెట్రో వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు హిమాయత్‌సాగర్ ఒక గేటు నుంచి 330 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు.
దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెట్రోవాటర్‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్అశోక్రెడ్డి సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు.
రిజర్వాయర్ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ (గండిపేట్)
పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు 1790.00 అడుగులు
ప్రస్తుతం 1761.20 అడుగులు 1788.25 అడుగులు
ఇన్‌ఫ్లో 1200 క్యూసెక్కులు 1600 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో 330 క్యూసెక్కులు 226 క్యూసెక్కులు