Ustaad Bhagath singh: గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. అదిరిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagath singh). మాస్ దర్శకుడు హరీష్ శంకర్(Harish shankar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్, హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

తాజాగా ఈ సినిమా నుండి గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. చాలా పవర్ ఫుల్ అండ్ యాక్షన్ మోడ్ లో ఉన్న ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవల్లో ఉంది. మరీ ముఖ్యంగా గ్లింప్స్ లో పవన్ చెప్పిన డైలాగ్స్ పిలిటికల్ గా హీట్ పెంచేస్తున్నాయి. నీ రేంజ్ ఇది అంటూ గాజు గ్లాసు పగలకొడుతూ విలన్ అనగా..  దానికి కౌంటర్ గా పవన్.. గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో.. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కనిపించని సైన్యం అంటూ చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్, పవన్ ఫ్యాన్స్ ని, జనసైనికులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మరి కొన్నిరోజుల్లో ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో.. కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్ ను విడుదల చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది. కానీ, పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తరువాత పవన్ కళ్యాణ్ ఇలా యాక్షన్ మోడ్ లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.