Ustad Zakir Hussain: ఉస్తాద్ ఆస్తి 8.48 కోట్లు.. ఒక్క కచేరీకి ఎన్ని లక్షలు అందుకునేవారంటే?

Ustad Zakir Hussain: ఉస్తాద్ ఆస్తి 8.48 కోట్లు.. ఒక్క కచేరీకి ఎన్ని లక్షలు అందుకునేవారంటే?

ప్రముఖ తబలా కళాకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (Ustad Zakir Hussain) సోమవారం (Dec 16న) కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్తులెంత..? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..

ఆరు దశాబ్దాల కెరీర్ లో జాకీర్ ఆర్థికంగా బాగానే స్థిరపడ్డారు. జాకీర్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.8.48 కోట్లు ఉంటాయని సమాచారం. అతడు ఒక కచేరీకి 5 -10 లక్షలు అందుకునేవారని తెలుస్తోంది.

ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ అల్లా రఖాకు పెద్ద కుమారుడు జాకీర్ హుస్సేన్. తన తండ్రి ప్రేరణతో ఏడు సంవత్సరాల వయస్సులో తబలా నేర్చుకోవడం ప్రారంభించాడు. అతడు 12 సంవత్సరాల వయస్సులో భారతదే శం అంతటా ప్రదర్శన ఇచ్చాడు. సెయింట్ మైఖేల్స్ హైస్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, సెయింట్ జేవియర్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యా డు.

హుస్సేన్ కథక్ నర్తకి, ఉపాధ్యాయురాలు అయిన ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నాడు. వారికి అనిసా, ఇసాబెల్లా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంగీతంతో పాటు సినిమాల్లో అతిథిగా కొన్నిసార్లు కనిపించాడు.

Also Read :- ఆర్‌ఆర్‌ఆర్‌ డాక్యుమెంటరీ ట్రైలర్‌ రిలీజ్.. ఏ ఓటీటీలో చూడాలంటే?

జాకీర్ హుస్సేన్ ప్రతిభకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి! తన కెరీర్‌లో ఆయన ఐదు గ్రామీ పురస్కారాలను అందుకున్నారు. అందులో మూడు.. ఈ ఏడాది అందుకున్నవే! అంతేకాకుండా ఒకేసారి మూడు గ్రామీలు అందుకున్న తొలి భారతీయుడు ఆయనే. 4 ఫిబ్రవరి 2024న, 66వ వార్షిక గ్రామీ అవార్డులలో హుస్సేన్ ఈ మూడు అవార్డులను అందుకున్నారు.

ఇక భారత ప్రభుత్వం ఆయన్ను.. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. 2023లో.. దేశ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ను ప్రకటించి గౌరవించింది.