కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి : పరుశురామ్​

కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలి : పరుశురామ్​

ఓయూ, వెలుగు: వర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని యూటీఏసీటీఎస్ అధ్యక్షుడు డాక్టర్ పరుశురామ్​ డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యూటీఏసీటీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కాలేజీలో గురువారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజ్ ప్రక్రియను ప్రారంభించిన తర్వాతే వర్సిటీలో అధ్యాపక భర్తీలు చేపట్టాలన్నారు. తమకు ఏడో పీఆర్సీని అమలు చేయడంతోపాటు బేసిక్ పే, డీఏ, హెచ్ఎస్ఏతో కూడిన పే స్కేళ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూటీఏసీటీఎస్ నాయకులు జితేందర్రెడ్డి, భీమయ్య, తిరుపతయ్య, విజయకాంత్, అర్జున్  పాల్గొన్నారు.