హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్ ట్రైనింగ్, పోలింగ్ సందర్భంగా మరణించిన టీచర్లు, ఎంప్లాయీస్ కుటుంబాలను ఆదుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావ రవి ఎన్నికల సంఘాన్ని కోరారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ జిల్లాలో మైనారిటీ గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ, సిద్దిపేట జిల్లాలో లకావత్ రామన్న, భద్రాద్రి జిల్లాలో జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ శ్రీకృష్ణ మృతి చెందారని తెలిపారు.
ములుగు జిల్లా బూరుగుపేట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు పోరిక మధుకర్ బ్రెయిన్ స్ట్రోక్ తో అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. రూల్స్ ప్రకారం రూ.15 లక్షలు ఎక్స్ గ్రేషియా ఎన్నికల అధికారులు మంజూరు చేయాల్సి ఉందన్నారు.