విద్యారంగ అభివృద్ధికి యూటీఎఫ్​ కృషి.. యూటీఎఫ్ నేతలు

విద్యారంగ అభివృద్ధికి యూటీఎఫ్​ కృషి.. యూటీఎఫ్ నేతలు

మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: టీఎస్ యూటీఎఫ్ మేడ్చల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ శిక్షణ తరగతులు దోమలగూడ  రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహించారు. చివరి రోజు ఆదివారం యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి యూటీఎఫ్ కృషి చేస్తోందన్నారు. మొదటి రోజు ఉదయం ఉపాధ్యాయ ఉద్యమం  అంశంపై  ప్రధాన సంపాదకులు పాపన్నగారి మాణిక్ రెడ్డి సంఘం పని విధానం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన తీరును వివరించారని తెలిపారు. మధ్యాహ్నం విద్యారంగం-లో శాస్త్రీయ ఆలోచనలు అనే అంశంపై రాష్ట్ర కార్యదర్శి వైజ్ఞాన మంజరి మాట్లాడారని పేర్కొన్నారు. 

రెండో రోజు ఉదయం లీవ్ రూల్స్ పై యూటీఎఫ్​ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి, విద్యారంగం– వర్తమానం అనే అంశంపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగయ్య మాట్లాడారని పేర్కొన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జయసింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి మదన్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాకేశ్​, వందన, కోశాధికారి గొడుగు శ్రీనివాస్, కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, కుమారస్వామి, సుందరయ్య, సుధాకర్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.