18 కొత్త బ్రాంచ్​లను తెరవనున్న ఉత్కర్ష్​బ్యాంక్​

18 కొత్త బ్రాంచ్​లను తెరవనున్న ఉత్కర్ష్​బ్యాంక్​

హైదరాబాద్​, వెలుగు : ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ ఎస్​ఎఫ్​బీఎల్)  తన 15వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా 18 కొత్త బ్యాంకింగ్ ఔట్‌‌లెట్‌‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉత్కర్ష్ ఎస్​ఎఫ్​బీఎల్ బ్యాంకింగ్ ఔట్‌‌లెట్ల సంఖ్య 966కి చేరుకుంటుంది.  

 బీహార్​లో 4 ఔట్‌‌లెట్లు, హిమాచల్ ప్రదేశ్​లో1 ఔట్‌‌లెట్, జార్ఖండ్​లో 2 ఔట్‌‌లెట్లు,  కేరళలో 2 ఔట్‌‌లెట్లు, మధ్యప్రదేశ్​లో 3 ఔట్‌‌లెట్లు, మహారాష్ట్రలో 1 ఔట్‌‌లెట్,  ఒడిశాలో 2 ఔట్‌‌లెట్లు, ఉత్తరప్రదేశ్​లో 2 ఔట్‌‌లెట్లు, ఉత్తరాఖండ్‌లో 1 ఔట్‌‌లెట్ తెరుస్తామని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ పర్వీన్ కుమార్ గుప్తా వెల్లడించారు..