ఉత్కర్ష్ ఎస్ఎఫ్​బీ 900వ ఔట్​లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

ఉత్కర్ష్ ఎస్ఎఫ్​బీ 900వ ఔట్​లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

ముంబై: ఉత్కర్ష్  స్మాల్  ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ ఎఫ్ బీ ఎల్) జార్ఖండ్, రాంచీలోని ఖుంటిలో బ్యాంక్  900వ ఔట్​లెట్ ను  ప్రారంభించింది.  తమ బ్యాంకు విస్తృత విస్తరణలో భాగంగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అంతటా నూతనంగా  ఏడు కొత్త ఔట్​లెట్లను ప్రారంభించామని తెలిపింది. బ్యాంకుకు ఇప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 903 ఔట్​లెట్లు ఉన్నాయి. 

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో పొదుపు ఖాతాలు, కరెంట్ ఖాతాలు, స్థిర డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, హోంలోన్లు, బిజినెస్​లోన్లు, ఆస్తిపై లోన్లు, క్రెడిట్ బీమా, పెట్టుబడి ఉత్పత్తులు వంటి వివిధ రుణ ఉత్పత్తులు, సేవలు ఉన్నాయి.