తెలంగాణలో ఉత్కర్ష్ బ్యాంక్ ఐదో బ్రాంచ్..వరంగల్లో కొత్త అవుట్ లెట్

తెలంగాణలో ఉత్కర్ష్ బ్యాంక్  ఐదో బ్రాంచ్..వరంగల్లో కొత్త అవుట్ లెట్

హైదరాబాద్​, వెలుగు: ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఉత్కర్ష్ ఎస్​ఎఫ్​బీఎల్​) వరంగల్‌‌లో తమ కొత్త బ్యాంకింగ్ అవుట్‌‌లెట్‌‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈశాఖ ప్రారంభంతో, బ్యాంకుకు తెలంగాణలో ఔట్​లెట్ల సంఖ్య ఐదుకు చేరింది. 

 దేశవ్యాప్తంగా 986 బ్యాంకింగ్ ఔట్​లెట్లను నిర్వహిస్తున్నామని ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ గోవింద్ సింగ్ అన్నారు. ఈ బ్యాంక్ సేవింగ్స్​,  కరెంట్ ఖాతాలు, ఫిక్స్‌‌డ్ డిపాజిట్లు,  రికరింగ్ డిపాజిట్లు సహా అన్ని రకాల లోన్లను అందిస్తుందని వివరించారు.