టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రైతులను మోసం చేస్తున్న తీరును వరంగల్ సభలో ఎండుగడుతామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లో రేపు జరగబోయే సభలో రైతులకు సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ మాట్లాడతారని చెప్పారు. ‘జనం వాయిస్ దృశ్య కావ్యం’ ప్రజా యుద్ధనౌక గద్దర్ వాయిస్ తో చేయించామన్నారు.
వరంగల్ సభను విజయంతం చేయండి
కాంగ్రెస్ శ్రేణులకు గీతారెడ్డి పిలుపు
రేపు వరంగల్ లో తలపెట్టిన రైతు సభకు రాహుల్ గాంధీ వస్తున్నారని, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి పిలుపునిచ్చారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం దేశానికీ ఎన్నో సేవలు అందించిందని చెప్పారు. ‘జనం వాయిస్ దృశ్య కావ్యం’లో ప్రజా యుద్ధ నౌక గద్దర్ చక్కటి వాయిస్ అందించారని అన్నారు.
మరిన్ని వార్తల కోసం..