
మేడిగడ్డ లొకేషనే పెద్ద మిస్టేక్ అని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఉత్తమ్.సుందీళ్ల, అన్నారం బ్యారేజీలు కట్టాల్సిన చోట కట్టలేదన్నారు. డీపీఆర్ లో ఒకటి చెప్పి.. ప్రాజెక్ట్ మరో చోట కట్టారని ఆరోపించారు. తుమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ను మార్చడమే పెద్ద తప్పని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టాక డీపీఆర్ కు వెళ్లారు. బ్యారేజీ నిర్మాణానికి ముందు సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? డీపీఆర్ ఆలస్యం వల్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. లోపాలున్నాయని ముందే తెలిసినా బీఆర్ఎస్ నిర్లక్ష్యంగా బ్యారేజీలు కట్టింది. డ్యామ్ సేఫ్టీ రూల్స్ ఒక్కటి కూడా పాటించలేదు.కేసీఆర్ ఎలా చెబితే అలా బ్యారేజీలు కట్టారు.
►ALSO READ | కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద నిర్లక్ష్యమైన ప్రాజెక్ట్.. కేసీఆర్ చేసిన పనికి ఇతర దేశాల్లో అయితే ఊరుకోరు
లోపాలతోనే మేడిగడ్డ కూలిపోయింది. అక్టోబర్ 21,2023న మేడిగడ్డ కూలిపోయింది ఆనాడు కేసీఆరే ముఖ్యమంత్రి. పలు కార్పొరేషన్ల నుంచి ప్రాజెక్ట్ కు లోన్లు తెచ్చారు. ఎక్కువ వడ్డీకి లోన్లు తెచ్చారు. వాళ్లు చేసిన అప్పులకు ఏడాదికి రూ. 16 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం.ఎన్డీఎస్ రిపోర్ట్ ను వ్యతిరేకించడం బీఆర్ఎస్ మూర్ఖత్వం.ఎన్డీఎస్ ఏ రిపోర్ట్ చూసి కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సింది పోయి విమర్శలా.?తప్పు చేసినందుకు కేసీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలి అని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.