కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ సునామీలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు ఆ పార్టీ సీనియర్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.  హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీను ఉత్తమ్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ..  గాంధీ కుటుంబానికి తెలంగాణకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు.  రాహుల్, ప్రియాంకా గాంధీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం చేపట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. 

మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత  రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ ఖండించారు.  రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి వారిది కాదన్నారు.  దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబం గాంధీలది అయితే..  తెలంగాణ సంపదను దోపిడీ చేసిన కుటుంబం కల్వకుంట్లదని విమర్శించారు.  కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో హామీలు ఇచ్చి నిలబెట్టుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఉత్తమ్ తెలిపారు. 

 కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని .. అందులో ఎటువంటి సందేహం లేదన్నారు ఉత్తమ్. బీఆర్ఎస్ దీనిపై అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.    హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా తాను చేసిన  అభివృద్దే మాత్రమే కనిపిస్తుందని తెలిపారు. 

ALSO READ :- ODI World Cup 2023: ధోని శిష్యుడికి గాయం.. వరల్డ్ కప్ నుండి ఔట్