మన బిడ్డల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో టీ టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన సందర్భంగా.... కోదాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి, మాజీ ఎమ్మెల్యే వీనేపల్లి చందర్రావు,తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.తెలంగాణ విధ్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలన్నారు.  ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేని ఆవేదన వ్యక్తం చేశారు.  

also read :- కబ్జా భూములను ప్రభుత్వానికి అప్పగిస్తా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
 

డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందని  ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.    బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే మేడిగడ్డ ప్రాజెక్ట్ ను నిర్మించిందన్నారు,  తాను గృహ నిర్మాణ శాఖామంత్రిగా ఉన్నప్పుడు విశాలమైన లక్షలాది ఇళ్లు కట్టిస్తే కేసీఆర్ అగ్గిపెట్టు ఇళ్లు కట్టించి ప్రజలను మోసం చేశారన్నారు. తెలంగాణలో పేదల పార్టీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అర్హులైన వారందరికి వంద గజాల ఇంటి స్థలంతో పాటు ... గృహ నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు