- ఆర్అండ్బీ శాఖకు రెండో మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి
- ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్అండ్ బి శాఖ మంత్రిగా పనిచేసిన జానారెడ్డి
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీనీటి పారుదల, పౌరసరఫరాల శాఖలకు మొదటి మంత్రిగా నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి రికార్డుకెక్కారు. గతంలో ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి, కుందూరు జానారెడ్డి చిన్న నీటి వనరుల శాఖలకు మంత్రులుగా పనిచేశారు. కానీ తొలిసారిగా భారీనీటి పా రుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన ఉత్తమ్ కోదాడలో రెండు సార్లు, హుజూర్‌నగర్‌లో వరుసగా నాలుగు సార్లు ఎమ్మె ల్యేగా గెలుపొందారు. ఇక రోడ్లు, భవనాల శాఖకు రెండో మంత్రిగా కోమటిరెడ్డికి చాన్స్ కొట్టేశారు. 1985లో ఎన్టీఆర్ కేబినెట్‌లో జానారెడ్డి 12శాఖలకు మంత్రిగా పనిచేశారు.
వాటిల్లో రవాణా, ఆర్‌అండ్‌బీ, చిన్న నీటి వనరుల శాఖలు కూడా ఉన్నాయి. మాజీ సీఎంలు డాక్టర్ వై.ఎస్.రాజశేఖ ర్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఐటీ, యువజన సర్వీసులు, క్రీడల శాఖలకు మంత్రిగా పనిచేశారు. మళ్లీ కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో పెట్టు బడులు, మౌలిక వసతులు, ఓడరేవుల శాఖ మంత్రిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2011లో మంత్రి పదవి వదులుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఆర్అండ్బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది