కొత్తగా నియమితులైన ఏఈఈల్లో130 మందికి వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారిని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. తమకు మూడు నెలలుగా జీతాలు రావడం లేదని కొందరు అధికారులు మంత్రి ఉత్తమ్దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బుధవారం ఆయన సీఎస్‌కు ఫోన్ చేశారు. జీతాలు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నించారు.
ఇటీవల ఇరిగేషన్‌శాఖలో 677 మంది ఏఈఈలు కొత్తగా నియమితులైన సంగతి తెలిసిందే. అందులో 130 మందికి జోనల్ వ్యవస్థపై రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా నియామకాలిచ్చిన కారణంగా జీతాలు ఆగిపోయాయి. మల్టీ జోన్–2లో ఉన్న వారికి మల్టీ జోన్–1లో పోస్టింగులు ఇచ్చారన్న చర్చ నడుస్తున్నది. ఈ క్రమంలోనే వారికి జీతాలు రావడం లేదు. దీంతో వారికి వీలైనంత త్వరగా జీతాలు అందేలా చూడాలని సీఎస్‌ను మంత్రి ఉత్తమ్ కోరినట్టు తెలిసింది.