కోదాడ అవినీతి మయంగా మారిపోయింది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ పూర్తి అవినీతి మయంగా మారిపోయిందని  కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.  సూర్యాపేట జిల్లా  కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంఛార్జి కాన్మంత రెడ్డి శశిధర్ రెడ్డి నివాసానికి 2023, అక్టోర్ 17వ తేదీ మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి ఆయనను కలిశారు.  శశిధర్ రెడ్డితోపాటు  పలువురు బీఆర్ఎస్  అసంతృప్తి నేతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న సమస్యల దృశ్య శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి  ఆహ్వానించడం జరుగుతుందన్నారు.స్థానిక  ఎమ్మెల్యే  వైఖరితో ఉద్యమ నాయకులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

 నాయకులపై ఎమ్మెల్యే  తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. కోదాడ అవినీతి మయంగా మారిపోయిందని,  గంజాయికి కేంద్ర బిందుగా కోదాడ మారిందని ఆరోపించారు. దోపిడీ జరుగుతున్న విషయం తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు. జాతీయ పార్టీ నుండి కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మావతి ఉన్న మాకు పోలీసులు బందోబస్తు ఇవ్వడం లేదని... ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్  కు పోలీసులు ఎందుకు బందోబస్తు ఇస్తున్నారని ప్రశ్నించారు. త్వరలోనే స్థానిక పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాని ఉత్తం హెచ్చరించారు. 

అనంతరం శశిధర్ రెడ్డి  మాట్లాడుతూ... "2010  నుండి కేసీఆర్ సారధ్యంలో టీఆరెస్ నుంచి 2014 లో పోటీ చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఎమ్మెల్యే చేస్తున్న వ్యవహార శైలి గురించి ఎప్పటికప్పుడు అధిష్టానానికి తెలియజేసిన పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మీద వ్యతిరేకత వల్లనే పార్టీ మారడం జరుగుతుంది. పార్టీ మీద ఎలాంటి కోపం లేదు.. స్థానిక ఎమ్మెల్యే వల్లనే పార్టీ మారుతున్నాం" అని తెలిపారు.