సన్న బియ్యం ఖర్చులో65 శాతం తెలంగాణ ప్రభుత్వానిదే: ఉత్తమ్

సన్న బియ్యం ఖర్చులో65 శాతం తెలంగాణ ప్రభుత్వానిదే: ఉత్తమ్

 సన్న బియ్యం ఖర్చులో 65 శాతం   రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం పంపిణీలో బీజేపీ అవస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కుడ కుడలో  సన్న బియ్యం లబ్ధిదారుడు పాలడుగు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు ఉత్తమ్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణో రేషన్ కార్డుల సంఖ్యను 2.81 కోట్ల నుంచి3.10 కోట్లకు పెంచుతామన్నారు.  దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు.

తెలంగాణలో 80 శాతం మంది సన్న బియ్యంతో లబ్ధిపొందనున్నారని చెప్పారు ఉత్తమ్.  రేషన్ కోసం  సంవత్సరానికి 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.  స్మార్ట్ కార్డుల ప్రక్రియ వేగవంతం అవుతోందన్నారు.  ఏడాదికి 30 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం క్వాలిటీ , క్వాంటిటీ కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బియ్యం క్వాలిటీలో లోపాలుంటే  నేరుగా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.  జిల్లా కలెక్టర్ల సారథ్యంలో పకడ్బందీగా  లోపాలు లేకుండా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు ఉత్తమ్.  

►ALSO READ | ఏపీ చర్యలను చూస్తూ ఊరుకోం.. రెండు ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో కేసులు వేస్తాం: మంత్రి ఉత్తమ్