సాగర్ డ్యాం విషయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అబద్ధాలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి 

హుజూర్ నగర్, మునగాల, వెలుగు:  నాగార్జునసాగర్ డ్యాం విషయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబద్ధాలు చెబుతున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌,  మునగాల మండలం కేంద్రంలోని నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో  మాజీ ఎమ్మెల్యే చందర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునగాల ఎంపీపీ, జడ్పీటీసీతో పాటు వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 60 ఏళ్ల క్రితం  నిర్మించిన సాగర్ ప్రాజెక్ట్ ద్వారా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్పారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ హయాంలో లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కుంగిపోయిందని మండిపడ్డారు.  ఈ విషయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు ఒక్కోరకంగా మాట్లాడాని, ఆఫీసర్లు ఇసుక అడుగున ఉండటం వల్ల కుంగిపోయిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. వేల కోట్లు దోచుకొని నాణ్యత లేకుండా ప్రాజెక్టులను నిర్మించడంతోనే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెడ్ స్టోరేజీలో ఉన్నా నీళ్లు ఇచ్చామని, ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కోదాడ, హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలకు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టవన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బుచ్చి పాపయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎం పాండురంగారావు, పార్టీ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, నాయకులు  శ్రీనివాస్,  యుగంధర్ రెడ్డి,  కోటేశ్వరరావు, జానకి రెడ్డి, బోస్,  శివారెడ్డి,  నాగన్న గౌడ్, అరుణ్ కుమార్,  రవి,  శ్రీనివాస్ గౌడ్,  గిరిబాబు,  సురేశ్ చౌదరి,  మల్లిఖార్జున్ రావు   పాల్గొన్నారు .