2029లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్గొండ: కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అదే తమ పార్టీ మూల సిద్ధాంతం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. 

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో ఆదివాసీ ప్రజా ప్రతినిధుల సాధికారత శిక్షణ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడారు. 'తండాల్లో సమస్యలు నాకు బాగా తెలుసు.. ఎంపీగా ఉన్నప్పుడు చాలా సార్లు పార్లమెంటులో ప్రస్తావించాను.. బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను నిర్వీర్యం చేసింది.. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఎవరు ఆపలేరు' అని తెలిపారు.