ఎన్నికల్లో గెలుపుపై చర్చించాం .. తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ఉత్తమ్

హైదరాబాద్, వెలుగు: సీడబ్ల్యూసీ మీటింగ్​లో పార్లమెంట్, తెలంగాణతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపుపై చర్చ జరిగిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని సోనియా, రాహుల్, ఖర్గేలు సూచించారని అన్నారు. ఆదివారం తాజ్​కృష్ణలో సీడబ్ల్యూసీ మీటింగ్ ముగిసిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

హైదరాబాద్​లో సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడలో పబ్లిక్ మీటింగ్ జరగడం మంచి పరిణామం అని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ నింపిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. 

Also Rard :- కరప్ట్​ కాంగ్రెస్​ మోడల్ .. సిటీలో మళ్లీ పోస్టర్ల కలకలం

రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదని విమర్శించారు. దళిత సీఎం, మూడు ఎకరాల భూ పంపిణీ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలు  కేసీఆర్​ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.