ఇన్నీ అబద్దాలు ఎప్పుడూ వినలేదు.. మేడిగడ్డ కుంగడానికి నేను కారణమా?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కేసీఆర్, కేటీఆర్ లు దిగజారి మాట్లాడుతున్నారని..  ఇన్నీ అబద్ధాల మాటలు తాను ఇప్పటివరకు వినలేదని నల్గొండ ఎంపీ, హుజూర్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.  కేసీఆర్ స్థాయిని ఆయనకు ఆయనే తగ్గించుకుంటున్నారని అన్నారు. 2023, నవంబర్ 19వ తేదీ  ఆదివారం తన ఆఫీస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..  50 వేలకు ఒక్క ఓటు తగ్గిన తాను రాజకీయ సన్యాసం తిసుకుంటా అనే మాట మీద ఉన్నానని చెప్పారు. 35 సంవత్సరాలుగా మేము ప్రజల్లోనే ఉన్నామని ... ప్రజా సమస్యలపైనే పని చేస్తామని ఉత్తమ్ అన్నారు.

6 గ్యారంటీలతో పాటూ నిరుద్యోగుల కోసం పెట్టిన మ్యానిఫెస్టోపై నిరుద్యోగులు స్వాగతిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కుటుంబంలో ఉద్యోగాలు తప్ప.. నిరుద్యోగులకు ఉద్యోగం రాలేదని విమర్శించారు.  కొత్త ఉద్యోగం దేవుడు ఎరుగు.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో,  కేంద్రంలో అనేక పదవుల్లో పనిచేశానని.. ఇప్పుడు కచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు.

ప్రజల మద్దతుతో ఆరుసార్లు గెలిచానని.. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న వాళ్ళలో తానే  సీనియర్ నని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటానని.. మంచి హోదాలో పని చేస్తానని ఇప్పటికి చెబుతున్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను రాష్ట్రం, కేంద్రంతె కీలక నేతనని..అన్నీ పనులు చూసుకుంటూ నియోజకవర్గానికి ఏమి కావాలో ఆలోచిస్తానని చెప్పారు. నియోజకవర్గంలోనే కూర్చొని.. కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేల లాగా  ప్రజలను,  వ్యాపారస్తులని ఇబ్బంది పెడుతూ అక్రమాలు, అవినీతి,  కమిషన్ల కోసం పనిచేయనన్నారు 

ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నాడు.. దళిత బంధు, గృహలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, బీసీ బంధు కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరికి పథకాన్ని అమలు చేయండి అంటే చేస్తారా?.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబితేనేనా.. ప్రాజెక్టుల్లో కమిషన్లు తీసుకొని మెడిగడ్డ ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమయ్యారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ పోలీసులు అధికార పార్టీకే సహకరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 75 సీట్లుకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని అన్నారు. డిసెంబర్ 3వ తేదీ కాంగ్రెస్ పార్టీ గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.