హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్

హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్
  • మూసీని  ప్రపంచ ప్రమాణాలతో రివర్‌‌ ఫ్రంట్‌‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్​
  • నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తం
  • సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తం
  • జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి
  • ఐటీలో హైదరాబాద్​ను టాప్​లో ఉంచుతం: మంత్రి శ్రీధర్​బాబు
  • హైటెక్స్‌‌లో సీఐఐ-–ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షో ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్​కు తమ ప్రభుత్వం గ్లోబల్​స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నదని, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ను గ్లోబల్​ సిటీగా మారుస్తామని ఆయన చెప్పారు.  గతంలో ఉన్న ప్రభుత్వాల వల్లే  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడు కనిపిస్తున్న ప్రపంచస్థాయి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని, విమానాశ్రయాలు,  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కృష్ణా నీరు,  మెట్రో రైలు,  అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అప్పుడే వచ్చాయని తెలిపారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మే 17 నుంచి మే 19 వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సీఐఐ-–ఐజీబీసీ గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక్క కుటుంబ ప్రభుత్వం కాదని (కేసీఆర్  కుటుంబాన్ని ఉద్దేశిస్తూ), ఎలాంటి సమస్యల పరిష్కారానికైనా 24 గంటలూ అందుబాటులో ఉండే నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వమని స్పష్టం చేశారు. మూసీ నదిని  ప్రపంచ ప్రమాణాలతో రివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. అలాగే, నగరం నలుమూలలా మెట్రో రైలును విస్తరించి, వ్యాపార అనుకూల వాతావరణం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.  హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు, జీడీపీని రెట్టింపు చేసేందుకు  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి హామీ ఇచ్చారు. 

మేం రెట్టింపు పెట్టుబడులను సాధించాం : మంత్రి శ్రీధర్​ బాబు 

ప్రస్తుతం ఐటీలో కర్నాటక తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. ఫస్ట్​ ప్లేస్​లో నిలిపేందుకు తమ సర్కారు కృషి చేస్తున్నదని  రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు తెలిపారు. ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు చేసిందని, తాము రెట్టింపు ఎగుమతులను సాధిస్తామని అన్నారు.  ‘మేం అధికారంలోకి వచ్చినప్పుడు చాలా మందికి అనుమానాలు ఉండేవి. గత ప్రభుత్వ విధానాలను మేం మార్చబోం. ఐటీకి మేం 1990లలోనే పునాదులు వేశాం. విదేశాల్లోని మన వాళ్లు కూడా ఎంతో సహకరిస్తున్నారు. దావోస్​లో ఇన్వెస్టర్లను మెప్పించాం. అంతకుముందు ప్రభుత్వం రూ.19,500 కోట్ల పెట్టుబడులు తెస్తే.. మేం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించాం” అని పేర్కొన్నారు. ఈజ్​ ఆఫ్​ డూయింగ్ ​బిజినెస్​ను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తామని శ్రీధర్​బాబు చెప్పారు. బిల్డర్లతో మరింత పారదర్శకంగా, స్నేహపూర్వకంగా వ్యవహరిస్తామని తెలిపారు. పరిశ్రమల విషయంలో గుజరాత్​కు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందని, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు అక్కడికి వెళ్తున్నాయని, వీటిని తాము అడ్డుకుంటామని శ్రీధర్​బాబు స్పష్టం చేశారు.