పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడినా అధిష్టానం చూసుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇది ఏఐసీసీ పరిధిలోని విషయం అని చెప్పారు. ఓ వైపు మునుగోడు బైపోల్, మరోవైపు రాహుల్ గాంధీ పాదయాత్ర ఉన్నాయని.. ఈ సమయంలో కాంట్రవర్సీ విషయాలపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని చెప్పారు. తనది నల్గొండ జిల్లా అయినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలవబోతున్నారని ఆ విషయం గురించి మాట్లాడదామని ఎంపీ ఉత్తమ్ కుమార్ అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా మునుగోడు ప్రజలు పట్టించుకోరని చెప్పారు. 8 ఏళ్లుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు ప్రజలకు ఏం చేశాయని ప్రశ్నించారు. మునుగోడు ప్రజలు ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.