నవదుర్గ ఉత్సవాల్లో .. బీజేపీ ఎంపీ హేమమాలిని డ్యాన్స్

దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యూపీలోని మథురలో నవదుర్గ మహోత్సవ్ లో భాగంగా నృత్య ప్రదర్శన చేశారు బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని. పార్వతి గెటప్ లో ఆమె చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. 

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నృత్యప్రదర్శన చేయడం సంతోషంగా ఉందన్నారు హేమమాలిని. కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.