ఈ కొత్త కార్లు కొనే వాళ్లకు గుడ్ న్యూస్.. రోడ్ ట్యాక్స్ లేదు

ఈ కొత్త కార్లు కొనే వాళ్లకు గుడ్ న్యూస్.. రోడ్ ట్యాక్స్ లేదు

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, ఈకో ఫ్రెండ్లీ వెహికిల్స్ ప్రోత్సహించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో  స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రికల్ వాహనాలు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ సమయంలో రోడ్డు పన్ను మినహాయింపు ఉంటుంది. 

దీంతో మారుతీ, టయోటా మరియు హోండా కంపెనీలు అందించే హైబ్రిడ్ కార్లు కొనేవారికి బెనిఫిట్ అంతేకాదు.. ఆయా కార్ల సేల్స్ కూడా పెరుగుతాయి. హైబ్రీడ్ కార్లకు 2025 వరకు రోడ్డు ట్యాక్స్ విధించమని అక్కడి ప్రభుత్వం తెలిపింది. 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గారాల లక్ష్యంగా పని చేస్తున్నామని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ & సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నిర్ణయం మా ఆలోచనలకు తగ్గట్టుగా ఉందని ఆయన అన్నారు.